03 November 2023
డయాబెటిక్ ఉన్నవారు చలికాలం లో తీసుకోవలసిన జాగ్రత్తలు
చలికాలం వచ్చందంటేనే మధుమేహం రోగులు అత్యంత జాగ్రత్తతతో మసలు కోవాల్సి ఉంటుంది.
చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా షుగర్ రోగులకు రక్తంలో షుగర్ లెవల్స్
అమాంతం పెరుగుతుంటాయి.
ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా గుండె, మూత్రపిండాలు, నరాలు, కళ్లపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది
.
చలిగాలుల కారణంగా రోగ నిరోధక శక్తి కూడా బలహీనపడి, రకరకాల సీజనల్ వ్యాధులు వెంటాడుతాయి.
బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఆహారంలో పలు జాగ్రతలు తీసుకోవాలని పోషకాహ
ార నిపుణులు సూచిస్తున్నారు.
మాంసం, చేపలతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే గుడ్లు, బీన్స్, నట్స్ వంటి ఆహారం తీసుకోవాలి.
సిట్రస్ పండ్లలో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతా
యి.
ఫైబర్ అధికంగా ఉండే ముల్లంగి, క్యారట్, బచ్చలి కూర, బీట్‌రూట్, గ్రీన్‌బీన్స్, క్యాబేజీ, మొక్కజొన్న క్యాలీ
ఫ్లవర్, బఠానీలను ఆహారంలో చేర్చుకోవాలి.
చలికాలంలో షుగర్ లెవల్స్‌ను పెంచే వేడి వేడి టీ, కాఫీలకు దూరంగా ఉండటమే మంచిది.
ఇక్కడ క్లిక్ చేయండి