ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి బాహుబలి.. సమస్యలన్నీ భూస్థాపితం..
15 August 2025
Prudvi Battula
ద్రాక్షను ఎండబెట్టడం ద్వారా ఎండుద్రాక్ష తయారు అవుతుంది. ఇది కేకులు, ఖీర్, బర్ఫీ మొదలైన అనేక రకాల డెజర్ట్‌లలో కూడా ఉపయోగిస్తారు.
జుట్టు రాలడాన్ని తగ్గించడం నుండి మలబద్ధకాన్ని తొలగించడం వరకు ఎండుద్రాక్షలో లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
ఎముకల వ్యాధి నివారణకు కావలసిన పొటాషియంతో పాటు ఎండుద్రాక్షలో చాలా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకు చాలా మేలు చేస్తుంది.
అధ్యయనాల ప్రకారం, ఎండుద్రాక్షలో ఉండే సూక్ష్మపోషకాలు బోలు ఎముకల వ్యాధి రాకుండా నిరోధించడంలో సహాయపడతాయి.
మీరు జుట్టు పొడిబారడం, చీలిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ప్రతిరోజూ ఎండుద్రాక్ష తినడం ప్రారంభించండి.
అవి శరీరానికి బలమైన శక్తితో పాటు పెద్ద మొత్తంలో విటమిన్ సిని కలిగి ఖనిజాలను వేగంగా గ్రహించడంలో సహాయపడుతుంది. జుట్టుకు పోషణను అందిస్తుంది.
ఎండుద్రాక్షలో అధిక పొటాషియం స్థాయి రక్తం నుండి సోడియంను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఎండుద్రాక్షలో పుష్కలంగా ఉన్న ఫైబర్ మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ ఆధార్ దుర్వినియోగం అయిందని సందేహమా? ఇలా తెలుసుకోండి..
ఫాస్టాగ్ వాడుతున్నారా.? ఈ టెక్నాలజీతో మీ మనీ సేవ్..
రోజుకో రకమైన నగలు ధరిస్తే.. గ్రహ దోషాలన్నీ ఫసక్..