క్యాప్సికమ్‌లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల నివారణంలో సహాయపడుతుంది.
TV9 Telugu
క్యాప్సికంలో దాదాపు అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. ఇందులో ఉండే యాంటీమైక్రోబియల్ గుణాలు గొంతునొప్పిని తగ్గిస్తాయి. గొంతు బొంగురుపోవడాన్ని కూడా దూరం చేస్తాయి.
TV9 Telugu
క్యాప్సికమ్ తినడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టదు. ఇందులోని విటమిన్ సి రక్తం గడ్డకట్టకుండా దోహదపడుతుంది. దీంతో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యల నుంచి కాపాడుకోవచ్చు.
TV9 Telugu
క్యాప్సికమ్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతగా మార్చడంలో సహాయపడతాయి. ఫ్రీరాడికల్స్ నుంచి చర్మం డ్యామేజ్ కాకుండా రక్షిస్తాయి.
TV9 Telugu
శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో క్యాప్సికమ్ దోహదపడుతుంది. రెగ్యులర్ డైట్‌లో క్యాప్సికమ్ చేర్చుకోవడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు.
TV9 Telugu
క్యాప్సికమ్ రెగ్యులర్‌గా తినడం వల్ల కాటరాక్ట్ వంటి కంటి సంబంధ సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. క్యాప్సికమ్‌లోని విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
TV9 Telugu
ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో క్యాప్సికమ్ దోహదపడుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ వంచి శ్వాస సంబంధ సమస్యల్ని నివారిస్తుంది. విరేచనాల సమస్యను తగ్గిస్తుంది.
TV9 Telugu
క్యాప్సికమ్ క్యాన్సర్ నివారిణిగా సహాయపడుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.. వీటిలోని క్యాప్ససిన్ అనే సమ్మేళనం రక్త కణాలతో కలిసి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి.