19 September 2023

బొప్పాయి ఆకుల రసం, కొబ్బరి నీళ్లు తెల్ల రక్త కణాలు పెంచుతాయా  ??

Pic credit - Instagram

వర్షాకాలంలో దోమలు దేశమంతటా పెరిగిపోతుంటాయి ఫలితంగా ఎక్కువ సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి.

 డెంగ్యూ జ్వరం వచ్చిన వారికి ప్రధానంగా ఎదురయ్యే సమస్య ల్లో శరీరంలో ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం ఒకటి.

అయితే కొన్ని పానీయాలు తాగడం వల్ల ఈ ప్లేట్‌లెట్లు పెరుగుతాయని జనాల్లో రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఇవి నిజమా ?? కాదా ?? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ప్లేట్‌లెట్లు తగ్గితే కొబ్బరి నీళ్లు, బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం చేస్తుంటారు.  కేవలం వీటి వల్ల మాత్రమే ప్లేట్ లెట్లు పెరుగుతాయనుకోవడం పొరపాటే.

ప్లేట్‌లెట్లు తగ్గితే వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో వాడటం తప్పనిసరి. వాటితో పాటు వీటిని తాగడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.

అలాగని వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల  రోగికి జీర్ణ, కాలేయ సంబంధిత సమస్యలు పెరుగుతాయని ప్రముఖ వైద్య నిపుణులు చెబుతున్నారు.