విందులో కంద చేరితే పసందే.. మరి డయాబెటిక్‌ రోగులు తినొచ్చా?

30 October 2024

TV9 Telugu

TV9 Telugu

రుచిలో అద్భుతంగా ఉండే కంద తెలుగు వారికి పరిచయమే. ముఖ్యంగా కార్తీకమాసం విందుల్లో కంద తప్పనిసరిగా ఉంటుంది. రుచికే కాదు పోషకాల్లోనూ ఇది అద్భుతమే

TV9 Telugu

కొవ్వు తక్కువగా ఉండి... చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే ఈ ఆహారంలో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది

TV9 Telugu

అయితే డయాబెటిస్ రోగుల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడేవారు కంద తినవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిపుణులు ఏం అంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

TV9 Telugu

నిజానికి  మధుమేహంతో బాధపడేవారిలో.. ఈ ఆహారం ఒక్కసారిగా చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తుందని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

కందలో అలంటోయిన్ అనే రసాయన సమ్మేళనం ఉందని, ఇది మధుమేహ రోగులకు మేలు చేస్తుందని డైటీషియన్ మమతా శర్మ చెప్పారు

TV9 Telugu

కందలో శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

ఇందులో విటమిన్ ఎ, పొటాషియం, ఐరన్ ఉంటాయి. ఈ పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. కంద కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది

TV9 Telugu

అంతే కాకుండా కందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కల్పించడంలో కంద బలేగా ఉపయోగపడుతుంది. అయితే ఆస్తమా రోగులు, గర్భిణీలు కంద తినే ముందు వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు అంటున్నారు