జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలా? ఆముదం నూనె ఇలా అప్లై చేయండి

06 August 2024

TV9 Telugu

TV9 Telugu

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అకారణంగా జుట్టు రాలిపోతుంటే ఆ బాధ వర్ణనాతీతం. దువ్వేటప్పుడు జుట్టు గుత్తులు గుత్తులుగా ఊడిపోతూ ఉంటుంది

TV9 Telugu

ఇంటి నివారణల నుంచి మార్కెట్‌లో దొరికే సౌందర్య సాధనాల వరకు మీరిప్పటి వరకు దాదాపు ప్రతిదీ ప్రయత్నించి ఉంటారు. కానీ ప్రయోజనం కనిపించడంలేదా?

TV9 Telugu

అయితే మీరు ఈ రోజు నుంచి జుట్టు ఆముదం నూనెను పట్టించండి. ముఖ్యంగా జుట్టు మూలాలకు ఆముదం నూనెను అప్లై చేస్తే.. జుట్టురాలడం తగ్గి.. మందపాటి, పొడవాటి, మృదువైన జుట్టు పొందుతారు

TV9 Telugu

ఈ నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు మూలాలు గట్టిపడతాయి. వాస్తవానికి ఆముదం నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

ఇవి ఫంగల్, మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ల నుంచి జుట్టును రక్షించడంలో సహాయపడతాయి. ఈ నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో,  జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది

TV9 Telugu

ఇందులో సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేసే రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది. కొవ్వు ఆమ్లాలు జుట్టు కుదుళ్లకు పోషణ అందించడం ద్వారా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి

TV9 Telugu

రెగ్యులర్ హెయిర్ మసాజ్ జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది. ఆముదం నూనె వాడకం శరీరంపై వివిధ ప్రభావాలను కలిగి ఉంటుంది. కడుపు నొప్పి, వికారం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి

TV9 Telugu

కాబట్టి ఆముదం నూనెను రెగ్యులర్ గా ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే ఆముదాన్ని పాదాలకు రాస్తే పగుళ్లు రాకుండా, మెత్తగా తయారవుతాయి