ఇలా చేస్తే ఒక్క నిమిషంలో ఒత్తిడి దూరం!

TV9 Telugu

09 February 2024

రోజువారీ జీవితంలో ఒత్తిడి సహజం. కాని అదే పనిగా ఒత్తిడి వేధిస్తే.. తలనొప్పి, వెన్నునొప్పి, కడుపునొప్పి, నిద్ర పట్టకపోవటం వంటి సమస్యలకు దారితీస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ బలహీనం కావటంతో పాటు ఏవైనా జబ్బులుంటే తీవ్రమవుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు వైద్యులు.

కాబట్టి ఒత్తిడి లక్షణాలను గుర్తిస్తే వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. గాఢంగా శ్వాస తీసుకోవటం ఒకటి.

దీన్ని నిమిషం పాటు చేసినా ఒత్తిడి లక్షణాలు తగ్గుతాయి. దీర్ఘకాలం ఒత్తిడి బారినపడకుండా నివారించుకోవచ్చు.

ముందుగా ప్రశాంతంగా కూచొని గానీ, పడుకొని గానీ ఒక అరచేతిని ఛాతీ మీద.. మరొక అరచేతిని కడుపు మీద పెట్టుకోవాలి.

ముక్కుతో నెమ్మదిగా గాఢంగా శ్వాస తీసుకోవాలి. ఈ సమయంలో కడుపు మీదుండే చేతిని కడుపు నెడుతుండాలి గానీ ఛాతీ మీది చేయి మాత్రం అలాగే ఉండాలి.

ఆ తర్వాత నెమ్మదిగా ముక్కుతో శ్వాసను వదిలేయాలి. ఇలా ఒక నిమిషం సేపు చేసినా మంచి ఫలితం కనబడుతుందని అంటున్నారు.

గాఢంగా శ్వాస తీసుకోవటం వల్ల నాడీ వ్యవస్థ అతిగా స్పందించటం తగ్గుతుంది. ఊపిరితిత్తులు సైతం మనం ప్రశాంతంగా ఉన్నామంటూ మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి.