అందమైన మెరిసే చర్మాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే చర్మం లోపలినుంచి ఆరోగ్యంగా ఉండాలంటే పక్కా డైట్ ఫాలో అవ్వాల్సిందే. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుకూరలు: ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో విటమిన్ల లోపాలు ఉండవు. ఇవి హైపర్ పిగ్మెంటేషన్ నుంచి ఉపశమనం కలిగించి చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తాయి.
నీరు: రోజంతా కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడం వల్ల ముఖం మెరుస్తుంది. నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
నిమ్మ రసం, కలబంద: ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. కలబంద రసం తాగడం వల్ల కూడా చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
పండ్లు: పండ్లలో ఉండే విటమిన్లు అనేక పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుతాయి. దీనితో పాటు ఆహారంలో సలాడ్‌లను ఖచ్చితంగా చేర్చుకోండి.
పెరుగు: రోజు కప్పు పెరుగు తినడం వల్ల ఎన్నో చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. మజ్జిగ తాగడం వల్ల కూడా చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.
డైలీ రొటీన్: గ్లోయింగ్ స్కిన్ కోసం డైలీ రొటీన్ సకాలంలో ఉండేలా చూసుకోవాలి. బయట జంక్ ఫుడ్ తినడానికి బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ తినేందుకు ప్రయత్నించండి.