ప్రస్తుతం వేసవి కాలం వచ్చేసింది.. వేసవి తాపం కూడా బాగా పెరిగిపోయింది.. మరి కొన్ని రోజుల్లో పిల్లలకు వేసవి సెలవలు కూడా మొదలు కానున్నాయి.
మరి సమ్మర్ వెకేషన్ మీ ఏకాంతంగా గడిపేందుకు కొన్ని అద్భుతమైన ప్రదేశాలున్నాయి. ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
మొట్టమొదటి ప్రదేశం 'లడాఖ్'. ఇక్కడ ఎత్తైన పర్వతాలు, మంచుకురిసే ప్రదేశాలతో.. ఇక్కడి వాతావరణం ర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది.
రెండోవది పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్. ఇది ఒక అందమైన ప్రదేశం. ఇక్కడి టీ తోటులు, పచ్చపచ్చని కొండ ప్రాంతాల నడుమ మీ ప్రయాణం అంద్భుతంగా ఉంటుంది.
ఉత్తరాఖండ్ మసూరీని కొండలకు రాణిగా పిలుస్తారు. పచ్చపచ్చని కొండలు, అందమైన సరస్సులకు మసూరీ చాలా ప్రసిద్ధి.
ఉత్తరాఖండ్ నైనీ సరస్సు, కొండ ప్రాంతాలు, ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి నైనితాల్. మీక్కావల్సినవారితో గడిపేందుకు ఇంతకంటే మంచి ఏకాంతమైన ప్రదేశం ఉండకపోవచ్చు.
మనాలీ, హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్‌లోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం మనాలీ. మంచు కురిసే కొండలు, థ్రిల్లింగ్ అడ్వంచర్లు, అన్నింటికీ మనానీ కేరాఫ్ అడ్రస్.