డ్రై ఫ్రూట్స్‌ను చాలా మంది నానబెట్టి తింటుంటారు .. అయితే ఇలా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.
డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తినడం వల్ల ఫైటిక్ యాసిడ్ యొక్క ఔటర్ లేయర్ తొలగిపోయి ఐరన్, జింక్, కాల్షియం వంటి మినరల్స్ శరీరానికి సరిగా అందుతాయి.
డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలు తొలిగిపోతాయి.
డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినడం వల్ల జుట్టు ఊడటం తగ్గి ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. అంతే కాకుండ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి, దీంతో ఎముకల ఆరోగ్యం పెరుగుతుంది.
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే ఫైబర్, ప్రోటీన్ అందుతాయి. ఆకలి తక్కువగా ఉంటుంది. ఈ విధంగా బరువు బ్యాలెన్స్ అవుతుంది.
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం వంటివి అందుతాయి. దాంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి
ఆయుర్వేదం ప్రకారం నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి.