గోండు కటిరా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, డైటరీ ఫైబర్, మెగ్నీషియం వంటి అనేక మినరల్స్‌తో పాటు విటమిన్లు కూడా ఉంటాయి.
TV9 Telugu
గోండ్ కటిరాలో ఉండే ప్రొటీన్ మీ కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, కణజాలాలను బాగు చేయడంలో సహాయపడుతుంది. ఇది శక్తిని కూడా అందిస్తుంది.
TV9 Telugu
గోండ్ కటిరా తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పురుషుల సంతానోత్పత్తికి కూడా ప్రయోజనకరంగా పనిచేస్తుంది.
TV9 Telugu
గోండ్ కటిరా తినడం వలన చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇది ముఖం పై మొటిమలను పోగొట్టడంలో, జుట్టు సమస్యలకు చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
TV9 Telugu
వేసవిలో అరికాళ్లు, కాళ్ల మంట సమస్య ఉన్నవారు గోండు కటిరను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. అయితే, పెరుగు, గోండ్ కటిరా కలిపి తింటే మరి మంచిది అంటున్నారు నిపుణులు.
TV9 Telugu
పెరుగుతో గోండ్ కటిరా కలిపి తినడం వల్ల ఎముకలకు మంచి బలాన్నిస్తుంది. చాలా సేపు కడుపు నిండుగా ఉంచి, త్వరగా బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది.
TV9 Telugu
గోండ్ కటిరా కూడా చాలా వరకు ఒత్తిడిని తగ్గించడంలో ప్రయోజనకరంగా పనిచేస్తుంది. పెరుగుతో కలిపి తినటం వల్ల మీరు రిలాక్స్‌గా, రిఫ్రెష్‌గా ఉంటారు.
TV9 Telugu
పెరుగుతో కలిపి గోండ్ కటిరా తినడం వల్ల మంచి నిద్రకు తోడ్పడుతుంది. ప్రశాంతమైన నిద్ర అన్ని రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది.
TV9 Telugu
శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి మీరు పెరుగుతో గోండ్ కటిరా తింటే ప్రయోజనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది.