జాజికాయతో ఈ ఒక్కటి కలిపి ముఖానికి రాసుకుంటే మచ్చలు మాయం..!జాబిల్లి లాంటి అందం..
22 Febraury 2024
జాజికాయకు ఔషధంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మసాలా దినుసుగా వాడే, జాజికాయ చర్మ సౌందర్యాన్ని పెంపొందించగలదు. జాజికాయ అందాన్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖం మీద నల్లని మచ్చలని మాయం చేస్తుంది.
జాజికాయ చర్మంపై ఉన్న వాపు, చికాకును తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు జాజికాయను ముఖంపై అప్లై చేసుకోవాలి. నేరుగా కాకున్నా కొన్ని ఇతర సౌందర్య ఉత్పత్తులతో కూడా జాజికాయను ఉపయోగించవచ్చు.
ఎండకు కమిలిపోయిన చర్మానికి జాజికాయ పొడిని, తేనెలో కలిపి ట్యాన్ అయిన ప్రదేశంలో రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే, కొన్నాళ్లకు ట్యాన్ మొత్తం పోతుంది. క్రమం తప్పకుండా దీన్ని వాడుతూ ఉండాలి.
జాజికాయ పొడిలో పావు స్పూన్ చందనం పొడి కూడా వేసి నీళ్లతో పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి, రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి. అరగంట పాటు అలా వదిలేసి, తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే, మొటిమలు, నల్లని మచ్చలు తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది అందంగా ఉంటుంది, ఇలా అందాన్ని మనం పెంపొందించుకోవచ్చు. చక్కటి చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
జాజికాయను కలబందతో కలిపి రాసుకుంటే మచ్చలు త్వరగా పోయి ముఖంపై మెరుపు కూడా వస్తుంది. ఈ రెండూ చర్మంపై కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. వీటిని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి.
జాజికాయను మెత్తగా నూరి, పాలలో కలిపి ముఖానికి రాసుకోవాలి. మీ ముఖంపై ఉన్న మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత చేతులతో సున్నితంగా మసాజ్ చేయండి.
ఆరిన తర్వాత సాధారణ నీటితో ముఖం కడుక్కోవాలి. పాలు ముఖంపై అలెర్జీ ఉండి పడనివారు దీనికి బదులు రోజ్ వాటర్‌ను కూడా జాజికాయతో కలిపి అప్లై చేసుకోవచ్చు.