20 October 2023

కడుపులో మంట, ఒంట్లో వేడిని తగ్గించే అద్భుత చిట్కాలు

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.

ముఖ్యంగా శరీరం వేడి చేయడం, కడుపులో మంట వంటి సమస్యలు పలువురిని వేధిస్తుంటాయి.

డీహైడ్రేష‌న్‌, జీర్ణ‌కోశ వ్యాధులు వంటి సమస్యలు కూడా కడుపులో మంటకు, వేడికి కారణం అవుతుంటాయి. 

కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు కడుపులో మంట లక్షణాలను తెలియపరుస్తాయి.

అధిక కారం, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు అధికంగా తిన్నప్పుడు కడుపులో మంట లక్షణాలు మొదలవుతాయి.

అప‌రిశుభ్రంగా ఉన్న ఆహారం తినడం వల్ల కూడా కడుపులో మంట, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. పెప్టిక్ అల్స‌ర్ల బారిన‌ప‌డే ప్రమాదమూ ఉంటుంది.

జీర్ణ‌క్రియ‌ను మెరుగ‌ప‌రిచి శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే ఆహార ప‌దార్ధాల‌తో కడుపులో మంట, వేడికి చెక్‌ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

కడుపులో మంటతో బాధపడేవారు అర‌టి పండును తినడం ద్వారా మంట లక్షణాల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

పొట్ట‌లో ఎసిడిటీని బ్యాలెన్స్ చేయ‌డంలో అర‌టి పండ్లు బాగా ఉపయోగపడతాయి.

మ‌జ్జిగ‌, దోస‌కాయ‌, కొబ్బ‌రి నీళ్లు, పెరుగు నిత్యం తీసుకోవ‌డం ద్వారా కడుపులో మంట, వేడి సమస్యను నివారించవచ్చని చెబుతున్నారు.