వావ్, పల్లీలు తింటే ఇన్ని ప్రయోజనాలా..!

Jyothi Gadda

14 May 2024

వేరుశనగల్లో ఎన్నో విటమిన్స్, న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటి వల్ల శక్తి లభిస్తుంది. ఇందులో విటమిన్ బీ కాంప్లెక్స్, నియాచిన్, రిబోఫ్లోవిన్, థియామిన్, విటమిన్ బీ6, పెంటోథెనిక్ యాసిడ్ ఉంటాయి.

వేరుశనగలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక గుడ్డులో ఉండే ప్రోటీన్ అందులో ఉంటాయి. ఒక గ్లాసు పాలలో ఉండే పోషకాలు ఉంటాయి. పల్లీల్లో మోనో ఇన్ శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అధికంగా లభిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌‌ను నాశనం చేస్తుంది. 

చలికాలం వేరుశనగలు తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. జలుబు, దగ్గు తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు తొలగుతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. బాదాంలో ఉండే పోషకాలు ఇందులో ఉంటాయి. శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది.

ప‌ల్లీల్లో ఫైబ‌ర్ కూడా పుష్క‌లంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఉప‌క‌రిస్తుంది. రోజూ 30 నుంచి 40 గ్రాముల ప‌ల్లీలు తింటే సరిపోతుంది. ఇది బ‌రువు త‌గ్గేందుకు కూడా తోడ్పడుతుంది. ఆక‌లిని పోగొట్టి ఎక్కువ‌సేపు క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది. 

ప‌ల్లీల లో గ్లైసెమిక్ ఇండెక్స్‌ను క‌లిగిఉండ‌టంతో మ‌ధుమేహ రోగులూ నిర‌భ్యంత‌రంగా వీటిని తీసుకోవ‌చ్చు. ప‌ల్లీల్లో ఫైబ‌ర్ అధికంగా ఉండ‌టంతో మ‌ల‌బద్ధ‌కాన్ని నివారించ‌డ‌మే కాకుండా ప్రేవుల ఆరోగ్యాన్ని కాపాడ‌తాయి. తీవ్ర వ్యాధుల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది. 

ఇక బెల్లంతో చేసే ఈ పల్లీ పట్టిలో ఐరన్​, ఫైబర్​, విటమిన్లు, మినరల్స్​తో పాటు ఆరోగ్యకర కొవ్వులు, జింక్, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పల్లీ పట్టీలు తీసుకోవడం ద్వారా మంచి పోషకాలు శరీరానికి అంది ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్​తో రోగ నిరోధక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ముఖ్యంగా పల్లీ పట్టీలో ఉండే బెల్లం బాడీకి అవసరమైన ఐరన్​ను అందిస్తుంది. వీటితో పాటు మీ డైట్​లో సమతులాహారం ఉండేలా చూసుకోవాలి. 

ఇన్సులిన్ ప్రసరణ సక్రమంగా ఉంటే డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. వేరు శనగల్లోని ప్రొటీన్, విటమిన్-E.. క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. రోజుకు 40 గ్రాముల వేరు శనగలు మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు.