రోజుకో బెల్లం ముక్క తింటే ఇన్ని లాభాలా..!

03 November 2024

TV9 Telugu

TV9 Telugu

జీర్ణ సంబంధిత సమస్యల నుంచి నెలసరి నొప్పుల వరకూ అన్నింటినీ చిటికెలో మాయం చేయాలంటే బెల్లం తినాల్సిందే. ఇలా చెప్పుకుంటూ పోతే బెల్లం తింటే నయం కాని అనారోగ్యమంటూ ఉండదంటే అది అతిశయోక్తి కాదు

TV9 Telugu

ఐరన్, క్యాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ప్రొటీన్, ఫాస్పరస్, పొటాషియం.. వంటి ఎన్నో ఖనిజాలతోపాటు బి-కాంప్లెక్స్‌, ‘సి’, ‘డి 2’, ‘ఇ’.. వంటి విటమిన్లు నిండి ఉన్న బెల్లాన్ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి

TV9 Telugu

ఈ క్రమంలో బీపీని అదుపు చేయడం, శరీరానికి తక్షణ శక్తిని అందించడం, నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడం, రక్తహీనతను తగ్గించడం.. ఇలా బెల్లం చేసే మేలు ఎన్నో ఉన్నాయి

TV9 Telugu

ముఖ్యంగా చలికాలంలో బెల్లం టీ తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. బెల్లం లడ్డూలను కూడా తింటుంటారు. రోజూ కొద్దిగా బెల్లం తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం

TV9 Telugu

రోజూ ఓ బెల్లం ముక్క తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ర్భిణులు బెల్లాన్ని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు, అలర్జీల బారిన పడకుండా కాపాడుకోవచ్చు

TV9 Telugu

బెల్లం మంచి మొత్తంలో ఐరన్‌, ఫాస్ఫరస్‌ను కలిగి ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ను తయారు చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి దీని వినియోగం రక్తహీనతను నివారిస్తుంది. రక్తాన్ని శుద్ధిచేసే గుణం దీనికి ఉంటుంది

TV9 Telugu

పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడే వారు, సక్రమంగా పీరియడ్స్ రాని వారు రోజూ కొద్దిగా బెల్లం తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది

TV9 Telugu

రోజూ కొద్దిగా బెల్లం తినడం వల్ల ఎముకలు కూడా బలపడతాయి. కీళ్ల నొప్పులను నివారిస్తుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి

TV9 Telugu

అయితే మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే తక్కువ మోతాదులో బెల్లం తినాలి. అంతే కాకుండా వేడికి సంబంధించిన సమస్యలతో బాధపడేవారు కూడా బెల్లం తినేముందు వైద్యులను సంప్రదించి సూచనలు తీసుకోవాలి