అత్తిపండ్లతో అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు..

13 September 2023

నిత్యం తీసుకోదగిన డ్రైఫ్రూట్స్‌లో అత్తిపండ్లు లేదా అజీర్ కూడా ప్రముఖమైనవి. ఈ క్రమంలో అత్తిపండ్లతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం..

అత్తిపండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, బలమైన ఎముకలు, షుగర్ లెవెల్స్ కంట్రోల్, బరువు తగ్గడం వంటి ప్రయోజనాలు పొందవచ్చు.

అలాగే అత్తిపండ్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

అంజీర్‌లోని పొటాషియం రక్తపోటును క్రమబద్ధీకరించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే ఇది రక్తప్రసరణకు ఉపయోగకరం.

కాల్షియం, ప్రొటీన్, ఫాస్పరస్ ఉన్న కారణంగా అత్తిపండ్లు ఎముకలను బలోపేతం చేయడంతో కూడా సహాయపడతాయి. ఎముకల సాంద్రత పెంచుతాయి.

అత్తిపండ్లలోని డైటరీ ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మదింపజేసి, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది.

దీనిలోని ఫైబర్ జీర్ణక్రియ రేటును మెరుగుపరిచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే కడుపును నిండుగా ఉంచి ఆకలి కోరికలను తగ్గిస్తుంది.

విటమిన్ సి ఉన్న కారణంగా అత్తిపండ్లు రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరిచి, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

చర్మ సంరక్షణలో కూడా అత్తిపండ్లు ఉపయోగకరంగా ఉంటాయి. దీనిలోని విటమిన్ ఎ, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఇందుకోసం పనిచేస్తాయి.