ఈ బ్లాక్ రైస్‌ని మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది.
బ్లాక్ రైస్ ఆరోగ్యకరం. దీని డైట్ లో చేర్చుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గేందుకు, మెటబాలిజం రేటు, షుగర్ కంట్రోల్లో ఉండేలా చేస్తుంది.
బ్లాక్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఆంథోనిసైనిన్స్ ఉండటం వల్ల ఇది సెల్ డ్యామేజ్ కాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది.
బ్లాక్ రైస్ లో మన శరీరానికి కావలసిన విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ, ఐరన్, జింక్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు సౌందర్యాన్నికి మంచిది.
బ్లాక్ రైస్ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. గుండె జబ్బుల సమస్యలు మన దరిచేరకుండా రక్షిస్తుంది.
బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి మంచిది. బ్లాక్ రైస్ తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది. తద్వారా బరువు కూడా పెరగకుండా ఉంటారు.
ఇది సన్ డ్యామేజ్ కాకుండా హానికరమైన యూవీ కిరణాలు, కాలుష్యం నుంచి మీ చర్మాన్ని కాపాడుతుంది. దీంతో ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని పొందుతారు.
బ్లాక్ రైస్‌లో లూటీన్, జియాంథీన్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ లో వయస్సు రీత్యా వచ్చే కంటి సమస్యలకు మంచి పరిష్కారంగా పనిచేస్తుంది.