5 ఫుడ్స్ తినండి.. 5 అడుగుల  జుట్టు  పొందండి

Phani.ch

25 May 2024

పొడవాటి అందమైన జుట్టు ప్రతి ఒక్కరి ఆశ. అయితే ఈ కాలంలో మనం తీసుకుంటే ఆహారపు అలవాట్లు, జీవన శైలికి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల ఒతైనా, పొడవైన జుట్టు పొందాలి అంటే ముఖ్యంగా ఈ ఆహారాలను మన డైట్లో చేర్చుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.

పొడవైన జుట్టు కొరకు మీరు మాంసాహారులైతే చేపలు, చికెన్ గుడ్లు తీసుకోవాలి. శాఖాహారులైతే పాలకూర, పుట్టగొడుగులు, పన్నీర్ వంటివి తీసుకుంటూ ఉండాలి.  

ఐరన్ లోపం ఏర్పడినప్పుడు జుట్టు బలహీనంగా మారటం మారుతుంది. దీంతో జుట్టు పెరుగుదల తగ్గుతుంది.. డ్రై ఫ్రూట్స్ , గుడ్డు, పాలకూర వంటివి తీసుకుంటు ఉండాలి.   

 బయోటిన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంటే వేరుశనగ వెన్న పీనట్‌ బట్టర్ దొరుకుతుంది. అలాగే చేపలు, గుడ్లు తొందరగా పొడవుగా పెరగడానికి ఈ ఆహారాలు ముఖ్యం. 

 ఎండు ఫలాలు, గుడ్లు ,పాల కూర జుట్టు పెరుగుదలకు సహాయపడే ఆహారాలు. ముఖ్యంగా ఇవి బయోటిన్ లోపం ఏర్పడకుండా చేస్తాయి. 

 అలాగే విటమిన్ ఇ ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా జుట్టు బాగా పెరుగుతుంది. బాదం గింజల్లో విటమిన్ ఇ ఉంఉటంది. వీటిని మీ డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.