లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘లియో’
‘మాస్టర్’ లాంటివిజయం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది
త్రిష కథానాయికిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై నిర్మిస్తున్నారు
ఈ చిత్రంలో సంజయ్ దత్, గౌతమ్ మేనన్, ప్రియా ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు
ఈ చిత్రం షూటింగ్ కొన్నాళ్లుగా కశ్మీర్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే
తాజాగా ఈ సుదీర్ఘ షెడ్యూల్ పూర్తయినట్లు తెలుస్తోంది
త్వరలో చెన్నైలో మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం
15రోజుల పాటు ఈ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత క్లైమాక్స్ షూటింగ్ కోసం హైదరాబాద్‌కు రానుంది చిత్రబృందం