21 December 2023

Pic credit - Instagram

సోషల్ మీడియాలో ఇంటిపేరు మార్చేసిన లావణ్య త్రిపాఠి..

టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెగా కుటుంబంలోకి కోడలిగా వెళ్లిన సంగతి తెలిసిందే. మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య వివాహం ఘనంగా జరిగింది. 

నవంబర్ 1న వీరిద్దరి వివాహం ఇటలీలోని టుస్కానీలో జరిగింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, స్నేహితులు, టాలీవుడ్ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. 

ఇటీవలే వీరిద్దరు వెకేషన్ వెళ్లొచ్చారు. ప్రస్తుతం ఇద్దరూ తమ కెరీర్స్ పై దృష్టి పెట్టారు. తాజాగా తన సోషల్ మీడియాలో ఇంటి పేరు మార్చింది లావణ్య త్రిపాఠి. 

ఇన్ స్టా‏లో మొన్నటి వరకు లావణ్య త్రిపాఠి అని మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ పేరును 'లావణ్య త్రిపాఠి కొణిదెల' అంటూ అప్డేట్ చేశారు మెగా కొడలు లావణ్య.

ఈ విషయాన్ని మెగా అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. కొణిదెల ట్యాగ్‏తో లావణ్యను చూడడం ఆనందంగా ఉందంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

లావణ్యకు ఇన్ స్టాలో 3.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ప్రస్తుతం వరుణ్ మట్కా సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ మూవీలో మీనాక్షి హీరోయిన్. 

ఇప్పటికే వరుణ్ పూర్తిచేసిన ఆపరేషన్ వాలంటైన్ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు శక్తి ప్రతాబ్ దర్శకత్వం వహించారు. 

లావణ్య, వరుణ్ తేజ్ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. 2017లో మిస్టర్ చిత్రీకరణలో ఏర్పడిన పరిచయం కాస్త ఆ తర్వాత ప్రేమగా మారినట్లు తెలిపారు.