మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు.

ఈ నెల 9న వీరిద్దరి నిశ్చితార్థం అంగరంగవైభవంగా జరిగింది. 

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

పెళ్లికి ముందే వరుణ్‌కి ఓ కండీషన్‌ పెట్టిందట లావణ్య. ఆ కండిషన్ కు ఓకే అంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పిందంట.

ఇంతకీ ఆ కండీషన్‌ ఏంటంటే.. లావణ్యకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. 

పెళ్లి అయిన తర్వాత కూడా భరతనాట్యం చేయాలనేది ఆమె కోరిక. ఇదే విషయాన్ని వరుణ్‌కు చెప్పిందట. 

పెళ్లి తర్వాత ఏదైనా స్టేజ్‌పై భరతనాట్యం చేసే చాన్స్‌ వస్తే వదులుకోనని తేల్చి చెప్పిందట. 

అలాగే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకపోయినా.. ప్రొడక్షన్స్‌ వైపు వెళ్తానని చెప్పిందట. 

లావణ్య కండీషన్స్‌కి వరుణ్‌తో పాటు మెగా ఫ్యామిలీ అంతా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇటలీలో వీరి పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం.