TV9 Telugu

పెండింగ్ చ‌లాన్ల‌పై రాయితీ.. వాహ‌న‌దారుల‌కు గుడ్‌న్యూస్.!

23 December 2023

వాహ‌న‌దారుల‌కు తెలంగాణా ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. పెండింగ్ చ‌లాన్ల‌పై ప్ర‌భుత్వం రాయితీ క‌ల్పించింది.

రూ. 2 కోట్ల‌కు పైగా పెండింగ్ చ‌లాన్లు ఉండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం రాయితీ క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. 

డిసెంబర్‌ 26 నుంచి జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు పెండింగ్ చ‌లాన్ల‌ను చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించింది.

ఆర్టీసీ బ‌స్సులు, తోపుడు బండ్ల‌పై 90 శాతం రాయితీ, టూ వీల‌ర్స్‌పై 80 శాతం, ఆటోలు, ఫోర్ వీల‌ర్‌పై 60 శాతం రాయితీ.,

భారీ వాహ‌నాల‌పై 50 శాతం రాయితీ క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 2022, ఫిబ్ర‌వ‌రి నెల‌లో పెండింగ్ చ‌లాన్ల‌పై నాటి ప్ర‌భుత్వం రాయితీ క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే.

రెండు, మూడు చక్రాల వాహనాలకు 75 శాతం, ఆర్టీసీ బస్సుల‌కు 70 శాతం, లైట్‌, హెవీ మోటారు వాహనాలకు 50 శాతం, తోపుడు బండ్లకు 75 శాతం రాయితీ ఇచ్చారు. 

నాడు రూ. 300 కోట్ల వ‌ర‌కు పెండింగ్ చ‌లాన్ల‌పై వ‌సూళ్లు అయ్యాయి.