22 November 2023

శీతల పానీయం బాటిల్ పూర్తిగా నింపి ఉండదు.. ఎందుకో తెలుసా ??

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది శీతల పానీయాలను ఇష్టపడతారు. 

శీతల పానీయాల సీసాలు ఎప్పుడూ నిండా ఉండవని మీరు ఎప్పుడైనా గమనించారా?

కంపెనీ తన స్వలాభం కోసమే ఇలా చేస్తుందని చాలా మంది భావిస్తున్నారు. 

శీతల పానీయం బాటిల్ పూర్తిగా నింపకపోవడం వెనుక సైన్స్ దాగి ఉంది.

శీతల పానీయం ద్రవంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు ఉంటుంది.

కూల్‌డ్రింక్ బాటిల్‌ను గది ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతకు చల్లబడిన తర్వాత ప్యాక్ చేస్తారు.  

సీసాలు కూడా వినియోగదారుని చేరే వరకు వెచ్చని ఉష్ణోగ్రతల వద్ద ఉంటాయి.

సీసా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, ఈ వాయువు విస్తరించడం ప్రారంభమవుతుంది. ఒక్కోసారి బాటిల్ పగలగొట్టి బయటకు వస్తుంది.

అందుకు అన్నింటినీ నివారించడానికి, కూల్‌డ్రింక్ బాటిల్ పూర్తిగా నింపడం జరగదు.