ఐటీ రిటర్న్స్  ఇంకా ఫైల్ చెయ్యలేదా? ​ఆ ప్రయోజనాలు కట్​!

Anil Kumar

31 July 2024

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్నులను దాఖలు చేసేందుకు ఈ రోజు జులై 31తో నిర్దేశిత గడువు ముగియనుంది.

ప్రస్తుతం 2 రకాల పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వీటిలో కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా ఉంటుందని తెలుస్తుంది.

కావాలి అనుకుంటే, గడువులోగా పాత పన్ను విధానానికి మారవచ్చు. మీకు ఏది ప్రయోజనకరమైతే, ఆ విధానాన్ని ఎంచుకోవడం మంచిది.

జులై 31 గడువు దాటిన తర్వాత, పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా కొత్త పన్ను విధానాన్ని మాత్రమే అనుసరించాల్సి ఉంటుంది

గడువు దాటిన తరువాత పాత పన్ను విధానాన్ని ఎంచుకునే ఆప్షన్‌ ఉండదు.  బిలేటెడ్‌ ఐటీఆర్‌ను కొత్త పన్ను విధానంలో మాత్రమే దాఖలు చేయాలి. 

దీని వల్ల పాత పన్ను విధానంలో మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకునే అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు కోల్పోతారు. 

జులై 30 వ తేదీ అనగా నిన్నటి వరకు 6 కోట్ల మందికి పైగా ఐటీఆర్ లు దాఖలు చెయ్యడం జరిగింది. అంతేకాకుండా..

ఫైల్ అయ్యిన ఐటీఆర్ అందులో 70 శాతం మంది కొత్త పన్ను విధానాన్నే ఎంచుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.