05 December 2023

శీతాకాలం వచ్చిందంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. బీ అలెర్ట్.!

శీతాకాలం వచ్చిందంటేనే ఆరోగ్యపరంగా పలు జాగ్రత్తలు పాటించాలి.

చలికాలంలో రోగ‌నిరోధ‌క వ్యవ‌స్ధ బ‌ల‌హీన‌ప‌డే ప్రమాదం పొంచి ఉంటుంది. 

జ‌లుబు, జ్వరం స‌హా వైర‌ల్ ఇన్ఫెక్షన్ల వంటివి దాడి చేస్తుంటాయి. 

సీజ‌న్ మారిన‌ప్పుడు త‌లెత్తే ఆరోగ్యపరమైన స‌వాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధకశక్తి బలహీన పడకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌న ఆహారంలో డ్రై ఫ్రూట్స్, కూర‌గాయ‌లు, బెల్లం వంటి ఆహార ప‌దార్ధాలు ఉండే విధంగా చూసుకోవాలి. 

నువ్వుల ల‌డ్డు, స‌జ్జ రోటీల వంటివి కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

బెల్లంతో చేసే ప‌ల్లీ ప‌ట్టీలో విట‌మిన్లు, మిన‌రల్స్‌తో పాటు ఫైబ‌ర్‌, ఆరోగ్య‌క‌ర కొవ్వులు, ఐర‌న్‌, ఫాస్పర‌స్‌, జింక్ వంటివి అధికంగా లభిస్తాయి.

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో ఇమ్యూనిటీ పెరుగుతుంది. బెల్లంలో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఐర‌న్‌ లభిస్తుంది.