మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై రియాక్ట్ అయిన ఆమె చిన్నతనంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి వెల్లడించింది.
'చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైతే, అది వాళ్లఅది వాళ్లను జీవితాంతం భయానికి గురి చేస్తుంది.
నా కన్నతండ్రే నాపై వేధింపులకు పాల్పడ్డాడు. అప్పుడు నా వయసు కేవలం ఎనిమిదేళ్లు. నాపై జరుగుతున్న ఈ ఆకృత్యాలను బయటపెట్టేందుకు ధైర్యం ఉండేది కాదు.
ఈ విషయాన్ని బయటపెడదామంటే మా అమ్మ నమ్మదేమో అని బాధపడేదాన్ని.
ఎందుకంటే ఆమె భర్తే ప్రత్యేక దైవం అన్నట్లు ఉండేది. కానీ నాకు పదిహేనేళ్లు వచ్చాక ఆ బాధను భరించలేక తండ్రిని ఎదిరించాను.
దీంతో ఆయన కుటుంబాన్ని వదిలి పారిపోయాడు. అప్పుడు మేం తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం.
కానీ ధైర్యం కూడగట్టుకొని జీవితంలో పోరాడటం నేర్చుకున్నాను' అంటూ ఖుష్భూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.