5 వికెట్లతో అద్భుత ప్రదర్శన.. స్పెషల్ రికార్డులో కుల్దీప్ యాదవ్..
కుల్దీప్ యాదవ్ భారత క్రికెట్ జట్టు కోసం చాలా సందర్భాలలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.
భారత్‌తో పాటు విదేశీ గడ్డపై కూడా అతను జట్టు కోసం అద్భుత ప్రదర్శన చేశాడు.
తాజాగా బంగ్లాదేశ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ 5 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
ఈ ప్రదర్శనలతో తన పేరు మీద ప్రత్యేక విజయం సాధించాడు.
కుల్దీప్ యాదవ్ 16 ఓవర్లలో 40 పరుగులిచ్చి 6 మెయిడిన్ ఓవర్లు ఇచ్చి, 5 వికెట్లు పడగొట్టాడు.
ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనతను కుల్దీప్ మూడోసారి సాధించాడు.
బంగ్లాదేశ్ కంటే ముందు ఆస్ట్రేలియా, భారత్‌లో ఈ ఘనతను ప్రదర్శించాడు.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగుల వద్ద ముష్ఫికర్ రెహమాన్‌ను కుల్దీప్ అవుట్ చేశాడు.
ముష్ఫికర్ 58 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు కొట్టి ఔట్ అయ్యాడు.
కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వికెట్ కూడా కుల్దీప్ తీశాడు. 25 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి ఔటయ్యాడు.
అతనితో పాటు నూరుల్ హసన్, తైజుల్ ఇస్లాం, ఇబాదత్ హుస్సేన్‌లను కుల్దీప్ అవుట్ చేశాడు.
5 వికెట్లతో అద్భుత ప్రదర్శన.. స్పెషల్ రికార్డులో కుల్దీప్ యాదవ్..
దీంతో కుల్దీప్ తన 5 వికెట్లను పూర్తి చేసుకున్నాడు.