ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. సౌత్ ఇండియాలోని అందమైన హీరోయిన్లలో ప్రత్యేకమైనది.

తొలి మూడు సినిమాలూ హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. ఈ అమ్మడికి స్టార్ డమ్ కలిసొచ్చింది.

మూడు హిట్స్‌తో హాట్రిక్ హిట్స్ నమోదు చేసిన ఈ భామ.. ‘ది వారియర్’ మూవీతో తొలి ఫ్లాప్‌ను అందుకుంది.

మొత్తంగా హాట్రిక్ లక్కీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న బేబమ్మకు వరుస ఫ్లాపులు బేజారు తెప్పిస్తున్నాయి.

వరుసగా ప్లాపులు వస్తున్నా కృతికి అవకాశాలు మాత్రం ఆగడం లేదు. వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

తాజాగా ఈ భామ విజయ్ దేవరకొండ సినిమాలో నటించనుందని టాక్ నడుస్తోంది.

దీంతో ఇప్పుడు కృతికి టైం బాగానే ఉందని అంటున్నారు ఆమె అభిమానులు