‘ఉప్పెన‘ సినిమాతో ఆకట్టుకున్నది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
ప్రేక్షకులకు ఇట్టే నచ్చేసే బ్యూటీల్లో కృతి శెట్టి ఒకరు. తెలుగులో వరుస హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
తాజాగా రామ్ తో కలిసి ‘ది వారియర్‘ సినిమాలో నటించింది.
చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటూ తనదైన అందంతో కుర్ర కారులని మరింత ఆకర్షిస్తుంది.
తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకుంది. అయితే ఆ ఫోటోలో ఈ మధ్య వస్తున్న అవతార్ ఫిల్టర్స్ ద్వారా తన ఫోటోలను ఎడిట్ చేసింది.
ఈ కుర్ర బ్యూటీ అవతార్ లుక్స్ లో మరింత ఆకర్షించింది.
‘ఒక కృతి.. ఎన్నో అవతారాలు‘ అంటూ క్యాప్షన్ పెట్టింది.