కొరియన్ మహిళలు వారి స్కిన్‌ని గ్లాసీ లుక్‌తో అట్రాక్ట్ చేస్తుంది.
ఇందుకోసం కొన్ని నేచురల్ స్కిన్ రొటీన్ ఫాలో అవుతుంటారు.
వీటిని ఫాలో అవ్వడం వల్ల మెరిసే స్కిన్ మీ సొంతమవుతుంది.
రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం వల్ల స్పాట్‌లెస్ స్కిన్ మీ సొంతమవుతుంది.
స్కిన్ కేర్‌లో క్లెన్సింగ్ చాలా ముఖ్యమైంది. చర్మాన్ని క్లీన్ చేయడం వల్ల మురికి, మలినాలను దూరం చేసి క్లీన్‌గా ఉంచుకోవచ్చు.
సూర్యుడి నుంచి యూవీ కిరణాల ద్వారా ప్రభావితం చేయనివ్వరు. చలికాలం అయినా సన్‌స్క్రీన్ అప్లై చేయకుండా బయటికి రారు.
చర్మానికి ఫేషియల్ మాస్క్ చాలా మంచిది. అయితే, కొరియన్ స్త్రీలు క్రీమ్స్ కంటే షీట్ మాస్క్‌లు వాడతారు. వీరు ప్రతి రోజూ షీట్ మాస్క్‌లు వాడుతుంటారు.
స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎంచుకోవడం కూడా ఎంత ముఖ్యమో ఫేషియల్ మసాజ్ కూడా అంతే ముఖ్యం. ముఖంపై సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేస్తే చర్మంపై రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో చర్మం మెరుస్తుంది.
రోజుకి కనీసం 7 గంటల పాటు నిద్రపోవడం చాలా ముఖ్యం. దీని వల్ల చర్మం మెరిసిపోతుంటుంది.