మెగా కోడలు ఉపాసన కొణిదెల బేబీ బంప్ తో ఉన్న లేటెస్ట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
9వ నెల గర్భంతో ఉన్న ఉపాసన .. పిక్చర్‌లో చిరునవ్వుతో తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తోంది.
అంతేకాదు తాను అమ్మ అవుతున్న సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్నానని.. మాతృత్వాన్ని స్వీకరించడానికి ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు ఉపాసన.
అంతేకాదు తాను మాతృత్వాన్ని వారసత్వం కొనసాగించడానికో.. లేదా మా వివాహ బంధం బలోపేతం కావాలనో కోరికతోనే స్వీకరించలేదన్నారు.
ఇండస్ట్రీ లో టాక్ ప్రకారం ఉపాసన డెలివరీ తేదీ జూన్ 16 నుండి జూన్ 22 వరకు ఉండవచ్చు. అంటున్నారు.
రామ్ చరణ్ , ఉపాసనలను తల్లిదండ్రుల ఆనందాన్ని అనుభవించడానికి ఒక అడుగు దూరంగా ఉన్నారు.
రామ్ చరణ్, ఉపాసన గతంలో చెప్పినట్లుగా, భారతదేశంలోని అపోలో ఆసుపత్రిలో ప్రసవం జరుగుతుంది .
ఈ వార్త కుటుంబంలోని సరికొత్త సభ్యుడి రాక కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానుల్లో ఉత్కంఠను పెంచింది.