ఇంట్లోనూ, పూజా గదిలోనే కాదు గుడిలోనూ, శుభ కార్యాలవ్వుడు. పిల్లల పుట్టిన రోజున వేడుకల్లోనూ, కొత్త పెళ్లి కూతురు అత్తారింటికి ప్రవేశించేటప్పుడు హారతి ఇస్తుంటారు.

మనం చేసే ఏ వని వెనకైనా ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఆ వని చేయాలి. ఏక హారతి వట్టినా దానికి ఓ ఆరోగ్య సూత్రం ఉంది.

శుభకార్యాల్లో స్నేహితులు, బంధువులు, గ్రామస్థులంతా ఒకే చోట చేరుతారు. అలాగే దేవాలయంలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శించుకుంటారు.

దాని వలన పరిసర ప్రాంతపు గాలి అవరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. హారతి తర్వాతే తీర్థ ప్రసాదాలు.

కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక  సూక్ష్మ క్రిములు కర్పూర పొగకు నశిస్తాయి. అందుకే హారతి ఇచ్చిన తర్వాతే దేవుడికి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక  సూక్ష్మ క్రిములు కర్పూర పొగకు నశిస్తాయి. అందుకే హారతి ఇచ్చిన తర్వాతే దేవుడికి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

అంతే కాదు ఆ తర్వాతే భక్తులకు కూడా తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. ఇలా చేయడం వల్ల అంటు వ్యాధులు అంటవూ. 

హారతి కల్లకు అద్దుకోవడం వల్ల ముక్కుకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి..

అలాగే అంటు వ్యాధులు కూడా ప్రబలకుండా ఉంటాయి.కర్పూర హారతి ఎలాగైతే క్షీణించి పోతుందో,అలాగే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలు సమసి పోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.