ఈ మధ్యకాలంలో సరోగసి అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌ సెలబ్రిటీల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రసవం ద్వారా పొట్టపై వచ్చే మార్కులు ఇలాంటి బ్యూటీ కారణాల వల్ల చాలా మంది సెలబ్రిటీలు సరోగసి పద్ధతి ద్వారా బిడ్డల్ని కంటున్నారు.

అయితే అద్దె గర్భం ద్వారా పిల్లలు కనే పద్ధతిని సరోగసి అంటారు. వేరే దంపతులకు చెందిన బిడ్డను మరొక మహిళ మోస్తుంది.

భర్త నుండి వీర్యం, భార్య నుండి అండాన్ని తీసి ల్యాబ్‌ లో ఫలదీకరణం చేయించి ఆ పిండాన్ని మరో మహిళ గర్భంలో ప్రవేశపెడతారు.

9 నెలలు ఆ పిండం అద్దె గర్భంలోనే పెరిగి ప్రసవం అయ్యాక దంపతులకు అప్పగించాల్సి ఉంటుంది.

సరోగసి పద్ధతిలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళకు ఆ బిడ్డపై ఎలాంటి హక్కులూ ఉండవు. అండం, వీర్యం ఇచ్చిన వారే ఆ బిడ్డకు చట్టప్రకారం తల్లిదండ్రులు అవుతారు.

సరోగసి - 2021 చట్టం ప్రకారం బిడ్డ కావాలనుకునే జంటకు కచ్చితంగా వివాహం జరిగి ఉండాలి.

మహిళ వయస్సు 23 నుండి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి. అలాగే పురుషుని వయస్సు 26 నుండి 55 ఏళ్ల మధ్య ఉండాలి.