భార్య భర్తల బంధం అంటే గొడవ పడడం, తిట్టుకోవడం, విడిపోవడం కాదు. భార్య భర్తల బంధం శాశ్వతం. ఒకరికొకరు శాశ్వతం
ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుంది.
వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉండాలి. భర్తకి భార్య బలం కావాలి. బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు.
గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది. భార్య భర్తల మధ్య ప్రేమ అనేది చాలా ముఖ్యం.
భార్యాభర్తల్లో ఒకరికి ఒకరు వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ వాటిని గౌరవించాలి. వారి ఇష్టాయిష్టాలను ఒకరికొకరు తెలియపరచుకోవాలి.
భార్యాభర్తలిద్దరూ పాలు నీళ్ళలా కలిసిపోవాలి. వీరి బంధంలో పక్క వారు ప్రవేశించడానికి అవకాశం ఇవ్వరాదు.
వీరి మధ్యలో మూడవ వ్యక్తి వచ్చారు అంటేనే గొడవలకు బీజం పడట్టు..