చింతపండు, చింతకాయ‌ల‌ను చూస్తేనే చాలా మందికి నోట్లో నీళ్లూరుతాయి

చింత‌కాయ‌లు ప‌చ్చిగా ఉన్నా పండుగా అయినా వాటితో పులుసు కూర‌లు చేసుకుని తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తుంటారు

చింత పండు, కాయ ఏదైనా సరే అద్భుత‌మైన ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి

ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి

ఇది మలేరియా వంటి వ్యాధుల చికిత్సకు సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగించబడుతుంది

చింతపండు బెరడు, వేరు పదార్ధాలు కడుపు నొప్పికి సమర్థవంతమైన నివారణగా నిరూపించబడ్డాయి

చింతపండు రసం అన్నంతో కలిపి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది