ఒక ముద్దు స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. శృంగారానికి ప్రేరేపిస్తుంది.

అంతే కాదు గుండె పనితీరును మెరుగుపరిచేందుకు, గుండె వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముద్దు  పనిచేస్తుందంటున్నారు నిపుణులు

పెదవి ముద్దు వల్ల దంతాలు తెల్లగా మెరుస్తాయట

ఒక్క ముద్దు వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..ఒత్తిడి, ఆందోళన, ఆత్రుత నుంచి దూరం చేస్తుంది.

ముద్దు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ రసాయనాల వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది.

ముద్దు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే ఎపినెఫ్రిన్ వల్ల రక్త నాళాలు వ్యాకోచించి రక్త సరఫరా మెరుగుపడుతుంది.

ముద్దు పెట్టుకునే సమయంలో ఉత్పన్నమయ్యే సలైవా వల్ల దంత క్షయం దూరమవుతుందట.

ముద్దు పెట్టుకునే సమయంలో శరీరం అడ్రినలిన్ అనే రసాయనాలు విడుదలవుతాయి. ఈ రసాయనం నొప్పులను నియంత్రిస్తుంది. అలాగే తలనొప్పిని సైతం తగ్గిస్తుందట