సినిమాలో పాత్ర పరంగా చిరిగిన బట్టలు కట్టి కష్టాలను ఎదురీదిన మనిషిగా కనిపించే నటుడు.. బయట ఆడీ కారులో తిరిగే హీరో లాంటి వాడు కాదు..

కెమెరా ముందు.. వెనుకా కూడా ఒకటే తీరు ఆయనది.వ్యవస్థలో లోపాలను ఎలుగెత్తి చాటే సినిమాలు తీస్తున్న నిజమైన హీరో.

ఎప్పటికైనా మన వ్యవస్థలో కాస్తయినా మార్పు రాకపోతుందా అని ఎదురుచూపులు చూస్తున్న స్వచ్చమైన తెలుగోడు ఆర్. నారాయణ మూర్తి.

తెలుగు తెరపై విప్లవాత్మక భావాల ఎర్రదనాన్ని ప్రజారంజకంగా అద్దుతూ వస్తున్నారు.సినిమా హీరో అవ్వాలని వచ్చి.. అవకాశాలు దొరకకపోయినా విసుగు చెందకుండా..

దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తూ సినిమాకి సంబంధించిన విశేషాలు నేర్చుకున్నారు నారాయణ మూర్తి. తన స్నేహితుల సహాయంతో తానే నిర్మాతగా మారి..

హీరో అంటే ఇలానే ఉండాలి అనే మూస పద్ధతికి వ్యతిరేకంగా ఇలా ఉన్నా హీరోనే అనిపించుకున్నారు నారాయణ మూర్తి. డబ్బుల లెక్కలు పక్కన పెడితే.. నారాయణ మూర్తి సినిమాలు ప్రజల్లో సృష్టించిన ప్రభంజనం లేవేలే వేరు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది రంగుల ప్రపంచంలో దాదాపు అసాధ్యం. ఒదిగి ఉండటం అనే పదానికి నిజమైన అర్ధం చూపించిన వారు నారాయాణ మూర్తి.