మసుద మూవీ లో నజియా క్యారెక్టర్ లో నటించిన నటి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నజియా క్యారెక్టర్ లో నటించిన నటి పేరు బాంధవీ శ్రీధర్. ఈ క్యారెక్టర్ లో బాంధవి అల్లాడించేసింది.

థియేటర్ లో అందరినీ వనికించేసింది అనే చెప్పవచ్చు. గుంటూరు జిల్లాకు చెందిన బాంధవి మోడలింగ్ ద్వారా సినిమాలలోకి వచ్చింది.

2019లో మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచిన బాంధవి.. అదే ఏడాది మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్, మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో విజేతగా నిలిచింది.

బాంధవి తండ్రి గత 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల తనకి నటనపై ఆసక్తి కలిగింది.

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఎదురుచూస్తున్న సమయంలో మసూద మూవీ ఆఫర్ రావడంతో.. ఈ చిత్రంలోని క్యారెక్టర్ నచ్చి ఓకే చేసిందట.

ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న బాంధవికి సరైన అవకాశాలు వస్తాయో లేదో వేచి చూడాలి.