చాలా మందికి కనురెప్పలు వణుకుతుంటాయి. అయితే.. కనురెప్పల వణుకు గురించి కొన్ని అపోహలు ఉన్నాయి

పని గ్యాప్ లో అప్పుడప్పుడు చాలా మందికి కనురెప్పలు వణుకుతుంటాయి. చిన్నపాటి వణుకు కూడా బాధాకరమే

ఈ సమస్య చాలా తీవ్రమైనది కాదు. కానీ.. ఎక్కువ కాలం నిర్లక్ష్యం వద్దు..

ఈ సమస్యకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. శారీరక, మానసిక, నాడీ పరమైన..

మూడు కారణాల్లో ఏదో ఒక కారణంగా కనురెప్పలు వణుకుతాయి. కానీ ప్రధాన కారణం అలసట

ఆందోళన, నిద్ర లేమి, తరచుగా ధూమపానం, అధికంగా కాఫీ తాగటం లేదా ఎక్కువసేపు కంప్యూటర్ వైపు చూస్తూ ఉండడం వల్ల కూడా ఇలా జరగవచ్చు.