క్రికెట్‌, సినీ ఫాలోవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేఎల్ రాహుల్, అతియా శెట్టిలు త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్నరు

ఈ నెల (జనవరి) 23న ఖండాలాలోని అతియ తండ్రి సునీల్ శెట్టి నివాసంలో వీరిద్దరి వివాహం జరగనుంది 

క్రికెట్‌, సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కానున్నారు

ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు వివాహ వేడుకలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుం‍డా సాదాసీదాగా జరగనున్నాయి

సినీ రంగం నుంచి సల్మాన్ ఖాన్, జాకీ షరాఫ్, అక్షయ్ కుమార్ వివాహ వేడుకలకు హాజరు కానున్నారు

అలాగే క్రికెట్ రంగం నుంచి ధోని, విరాట్ కోహ్లి తదితరులు వివాహ వేడుకకు హాజరవుతారని సమాచార

కాగా కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నాడు

అయితే అతియ మాత్రం వివాహా ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూసుకొంటుంది