టీంఇండియా స్టార్ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, నటి అతియా శెట్టిల వివాహం జనవరి 23న అంగరంగ వైభవంగా జరగింది.

సినీప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఐతే పెళ్లికి వచ్చిన ప్రముఖులు ఇచ్చిన గిఫ్ట్‌ల గురించి తాజాగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ, సల్మాన్‌ ఖాన్‌, జాకీ ష్రాఫ్, ఎమ్‌ఎస్‌ ధోనీ వంటి ప్రముఖులు కోట్ల రూపాయల ఖరీదైన బహుమతులు ఇచ్చారని సమాచారం.

విరాట్‌ కోహ్లీ, ధోనీతో రాహుల్‌కు ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 

ఐతే రాహుల్‌, అతియాలకు పెళ్లి కానుకగా కోహ్లీ ఏకంగా 2.17 కోట్ల రూపాయల విలువైన బీఎమ్‌డబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడట.

ఇక ధోనీ 80 లక్షల రూపాయలన విలువైన కవసాకి నింజా బైక్‌ను బహుమతిగా ఇచ్చాడని సమాచారం.

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ శెట్టి తన గారాల కూతురికి పెళ్లి బహుమతిగా ముంబాయిలో 50 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన బంగ్లా ఇచ్చినట్లు టాక్‌.

ఇక సునీల్‌ శెట్టి సహనటులైన సల్మాన్‌ ఖాన్‌, జాకీ ష్రాఫ్‌లు సైతం ఖరీదైన బహుమతులు ఇచ్చారట. 1.64 కోట్ల రూపాయల విలువైన ఆడీ కారును అతియాకు గిఫ్ట్‌గా ఇచ్చాడని టాక్.