వంటకాల్లో పులుపు, ఉప్పు ఎక్కువైతే నీళ్లల్లో నానబెట్టిన బ్రెడ్డు ముక్కను వేసి కలియబెట్టితే సరి

అల్లం వెల్లులిని పేస్టే చేసేటప్పుడు దానిలో టేడుల్ స్పూన్‌ నూనె వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది

దోశపిండి కోసం బియ్యం, మినపప్పు నానబెట్టేటప్పుడు, కాసిన్ని పచ్చిశెనగపప్పు, స్పూన్‌ మెంతులు వేస్తే దోశలు కరకరలాడుతూ ఉంటాయి

బంగాళదుంప ముక్కలని మజ్జిగలో పది నిమిషాలు ఉంచి, వేయిస్తే అతుక్కుపోకుండా చక్కగా వేగుతాయి

చపాతీలు మిగిలిపోతే మర్నాడు వెన్నతో కొద్దిగా కాల్చితే రుచిగా ఉంటాయి

వామును చిన్న వస్త్రంలో మూటలా కట్టి పట్టుచీరల పక్కన ఉంచితే, దుస్తుల రంగు మారదు

ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు పంచదార వేస్తే త్వరగా వేగుతాయి