ఈ వంటింటి చిట్కాలు మీ సమయాన్ని, శక్తిని ఆయా చేస్తాయండోయ్‌.. అవేంటంటే..

వేపుళ్లలో నూనె ఎక్కువైతే బ్రెడ్‌ ముక్క లేదా ఉడికించిన బంగాళదుంప ముక్క వేసి తీస్తే సరి

బత్తాయిలు, నిమ్మకాయల్ని పదినిమిషాలు వేడినీటిలో ఉంచితే, రసం ఎక్కువగా వస్తుంది

బొద్దింకలు, పురుగులు తిరిగే చోట లవంగాలను ఉంచితే అవి పారిపోతాయి

కొవ్వొత్తులను కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, ఆపై వెలిగిస్తే ఎక్కువసేపు వెలుగుతాయి

బియ్యం, కొద్దిగా చక్కర వుంచిన డబ్బాలో బిస్కెట్స్‌ వేస్తే చాలా రోజులు తాజాగా ఉంటాయి

అరటి, బంగాళదుంప ముక్కల మీద ఉప్పునీళ్లు చల్లి పావుగంటయ్యాక వేపుడు చేస్తే, ముక్కలు బాగా వేగుతాయి