నిమ్మపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే, తొడిమ తీసిన పచ్చిమిర్చి ఒకటి వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టండి

చేపలు వాసన రాకుండా ఉండాలంటే ఉడికించడానికి ముందు వెనిగర్‌తో కడిగితే చాలు

కూరల్లో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యం పిండి కలిపితే రుచిగా ఉంటుంది

పూరీలు రుచిగా కరకర లాడాలంటే కాస్త వాము, శెనగపిండి, బ్రెడ్‌పొడి కలుపుకోవాలి

పాల్లో మీగడ చక్కగా రావాలంటే, పాలుకాసే ముందు పాలగిన్నెను చల్లటి నీటిలో ఉంచండి

యాపిల్స్‌ ముక్కలుగా కోశాక రంగుమారకుండా ఉండాలంటే.. చాక్‌కు కొద్దిగా నిమ్మరసం రాసి ఆ తర్వాత యాపిల్‌ను కోసుకోవాలి

బియ్యాన్ని శుభ్రంచేసి నాలుగైదు చుక్కల ఆముదం పట్టిస్తే అవి పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి