హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం.

రీసెంట్‌గా 'వినరో భాగ్యము విష్ణు కథ'చిత్రంతో ముందుకొచ్చిన ఈయన ఎక్కువ గ్యాప్‌ తీసుకోకుండా 'మీటర్‌' చిత్రంతో వచ్చేందుకు రెడీ అయిపోయాడు.

ఇదిలా ఉంటే కిరణ్‌ అబ్బవరం​ ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడంటూ గట్టిగానే టాక్‌ వినిపిస్తుంది.

తాజాగా కశ్మీర్‌ ట్రిప్‌కు వెళ్లిన కిరణ్‌ అబ్బవరం​ దీనికి సంబంధించిన పలు ఫోటోలను షేర్‌ చేశాడు.

అయితే సేమ్‌ లొకేషన్స్‌తో హీరోయిన్‌ రహస్య గోరక్ కూడా ఫోటోలను షేర్‌ చేయడంతో వీరి వ్యవహారం ఇప్పుడు తెరమీదకి వచ్చింది.

‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరో, హీరోయిన్లుగా వెండితెరకు పరిచయమైన కిరణ్‌-రహస్యలకు ఆ సినిమా నుంచే మంచి అనుబంధం ఉంది.

సినిమాల పరంగా కిరణ్‌ అబ్బవరం జోరు మీదుంటే, ఫస్ట్‌ మూవీ తర్వాత రహస్య కెరీర్‌ ఆశించినంత సక్సెస్‌ఫుల్‌గా లేదు.