కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ ( Kiccha Sudeep) హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం విక్రాంత్‌ రోణ.

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌(Jacqueline Fernandez) సుదీప్‌ సరసన ఆడిపాడింది.

జులై 28న కన్నడతో పాటు తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది.

మిస్టరీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది.

ఈ థ్రిల్లర్‌ ఇప్పుడు డిజిటల్‌ మీడియంలోనూ ప్రసారమవుతోంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో ఈరోజు (సెప్టెంబర్‌ 2న) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.

అయితే కేవలం కన్నడ వెర్షన్‌ మాత్రమే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

విక్రాంత్‌ రోణ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ డేట్‌ తాజాగా బయటకు వచ్చింది. సెప్టెంబర్‌ 16 నుంచి తెలుగు వెర్షన్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది.