బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మలోత్రా ఈ నెల 7న పెళ్లితో ఒక్కటయ్యారు.
కుటుంబ సభ్యులు, ప్రముఖులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో రాజస్థాన్ లోని జైసల్మేర్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు
తాజాగా మెహందీ, సంగీత్, పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు ఈ జంట.
సంగీత్ వేడుకల్లో సిద్ధార్థ్ తో దిగిన ఫోటోను కియారా అద్వానీ షేర్ చేసుకుంటూ ‘ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్ థింగ్ రియల్లీ స్పెషల్’ అంటూ రాసుకొచ్చారు.
అయితే ఆమె ధరించిన లెహంగా హాట్ టాపిక్‌గా మారింది. బంగారం, వెండిలతో చేసిన ఈ లెహంగాను డిజైన్ చేశారు ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా.
ఈ లెహంగాకు 98 వేలకు పైగా క్రిస్టల్స్ వినియోగించారట. దీని తయారీ కోసం 4 వేల గంటల సమయం పట్టిందట.
అంటే 150 రోజుల పాటు శ్రమించి రూపొందించిందీ మనీష్ మల్హోత్రా టీం. ఈ ధర లక్షల్లో ఉంటుందని సమాచారం.