కియారా అద్వానీ(Kiara Advani).. ఈ అందం తెలుగు ప్రేక్షకులను సుపరిచితమే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఈ బ్యూటీ..

తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించిన టాప్ హీరోయిన్ గా మారిపోయింది కియారా.

ఇప్పుడు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు హైదరాబాద్ లో వాలింది కియారా.

చరణ్ – కియారా కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ రోజు నుంచి 15 రోజుల పాటు చిత్రీకరించనున్నారట.

బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు రామ్ చరణ్ కోసం హైదరాబాద్ కి చేరింది.