కేజీఎఫ్ స్టార్ యష్‌కు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
ఈ మూవీతో యష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్‌గా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
అయితే రాకింగ్ స్టార్ నెక్ట్స్ మూవీతో ఎవరితో చేయనున్నాడు అంటూ ఇప్పటికే అభిమానులలో క్యూరియాసిటి నెలకొంది.
తాజాగా ముంబైలో జరిగిన ఇండియా టూడే కాన్క్లేవ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న యష్.. తన తదుపరి సినిమాలు.. కేజీఎఫ్ 3 పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
గతంలో సౌత్ సినిమాలను ఎగతాళి చేసేవారని.. కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయని అన్నారు.
అంతే కాకుండా దక్షిణాది చిత్రాలు తక్కువ ధరకు అమ్ముడయ్యేవి. కానీ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
ఆ క్రెడిట్ జక్కన్నకే దక్కింది. బహుబలి సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేసారు. ఇక ఆ తర్వాత ఆ చిత్రాన్ని భిన్నంగా కేజీఎఫ్ వచ్చింది. కేజీఎఫ్ సినిమా స్పూర్తి కలిగించింది.
ప్రస్తుతం ప్రజలు సౌత్ సినిమాలను గమనించడం స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు ఇక్కడకు వచ్చిన మార్కెట్ చేయాలంటే వేరే బడ్జెట్ ఉండేది.