గత వారం రోజుల్లో కిలో చికెన్ ధర రూ. 50 నుంచి రూ.60 వరకు పెరిగింది.
త్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే చికెన్ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు.
వచ్చే ఆదివారం నాటికి ధర మరింత పెరిగే అవకాశం ఉందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు.
ఆదివారం కిలో కోడి మాంసం రూ.250కి చేరింది.
ఎండలు మండుతుండటం, వేడి గాలుల తీవ్రతతో ఫారాల్లోని కోళ్లు చనిపోతుండటంతో ఉత్పత్తులు పడిపోయాయి.
దీంతో చికెన్ ధరలు ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం రిటైల్‌గా కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.250 వరకు విక్రయిస్తుండగా..
స్కిన్‌తో ఉన్న చికెన్ రూ.220 వరకు అమ్ముతున్నారు.